- స్టాక్‌మార్కెట్లో ఈవారం కీలక కార్యకలాపాలు
- ఓలా ఎలక్ట్రిక్ సహా 10 కంపెనీలు ఐపీవోకు సిద్ధం
న్యూ ఢిల్లీ, జూలై 28: దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీవోల వారం వచ్చేసింది. .జూలై 29 నుంచి ప్రారంభమయ్యే వారంలో ప్రైమరీ మార్కెట్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరగనున్నాయి. ఈసారి కొత్తగా 10 ఐపీవోలు వస్తుండటమే దీనికి కారణం. వీటిలో మెయిన్బోర్డ్ సెగ్మెంట్ నుంచి 3, SME సెగ్మెంట్ నుంచి 7 ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పటికే ప్రారంభించిన ఐదు ఐపీవోలలో పెట్టుబడి పెట్టడానికి కూడా అవకాశం ఉంది.
స్టాక్ మార్కెట్లో కొత్తగా రానున్న ఐపీవోల వివరాలు..
- ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ: సాఫ్ట్బ్యాంక్ సపోర్ట్ గల ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో ఆగస్టు 2న రిటైల్ సబ్స్క్రిప్షన్ తెరవనుంది. ఆగస్టు 6న మూసివేయనుంది. ఈ వారంలో ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ దాదాపు 37.9 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఈ షేర్ల ద్వారా కంపెనీ రూ.5,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.
- సిగల్ ఇండియా ఐపీవో: ఇది ఆగస్టు 1న తెరవబడుతుంది. దీని ధర, లాట్ పరిమాణం ఇంకా ప్రకటించలేదు. ఆగ స్టు 5 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఆగస్టు 8న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో షేర్లు లిస్టయ్యే అవకాశం ఉంది.
- బల్కార్ప్ ఇంటర్నేషనల్ ఐపీవో: రూ. 20.78 కోట్ల ఈ ఇష్యూ జూలై 30న ప్రారంభమై, ఆగస్టు 1న ముగుస్తుంది. ఆగస్టు 6న ఎన్‌ఎస్‌ఈ, ఎస్‌ఎంఈలో షేర్ల లిస్టింగ్ జరుగుతుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,00-,105, లాట్ పరిమాణం 1200 షేర్లు.
- కిజి అప్పారెల్స్ ఐపీవో: రూ.5.58 కోట్ల ఈ ఇష్యూ కూడా జూలై 30న ప్రారంభం కానుంది. ఆగస్టు 1 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఆగస్టు 6న బీఎస్‌ఈ, ఎస్‌ఎంఈలో షేర్లు లిస్ట్ కానున్నాయి. ఒక్కో షేరు ధర రూ.21, లాట్ పరిమాణం 6,000 షేర్లు.
- సత్లోఖర్ సినర్జీస్ E&C గ్లోబల్ ఐపీవో: ఇది జూలై 30న తెరవబడి ఆగస్టు 1న పూర్తవుతుంది. దీని ద్వారా రూ. 92.93 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఆగస్టు 6న ఎన్‌ఎస్‌ఈ, ఎస్‌ఎంఈలో షేర్లు లిస్ట్ చేయబడతాయి. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,33,-140, లాట్ పరిమాణం 1,000 షేర్లు.
- అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాసుటికల్స్ ఐపీవో: రూ. 1,856.74 కోట్లతో జూలై 30న ప్రారంభం కానున్న ఈ ఇష్యూ ఆగస్టు 1న ముగుస్తుంది. ఆగస్టు 6న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేర్ల లిస్టింగ్ జరగనుంది. ఒక్కో షేరు ధర రూ. 6,46,679. లాట్ పరిమాణం 22 షేర్లు.
- రాజ్పుతానా ఇండస్ట్రీస్ ఐపీవో: రూ. 23.88 కోట్ల ఈ ఇష్యూకి ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.3,6-38. లాట్ పరిమాణం 3,000 షేర్లు. ఐపీవో జూలై 30న ప్రారంభమై, ఆగస్టు 1న ముగియనుంది. ఆగస్టు 6న ఎన్‌ఎస్‌ఈ, ఎస్‌ఎంఈలో షేర్ల లిస్టింగ్ జరుగుతుంది.
- ఆషాపురా లాజిస్టిక్స్ ఐపీవో: ఇది జూలై 30న తెరవబడి, ఆగస్టు 1న ముగుస్తుంది. రూ.52.66 కోట్లు సమీక రించాలని కంపెనీ భావిస్తోంది. ఒక్కో షేరు ధర రూ.1,36,-144. లాట్ పరిమాణం 1,000 షేర్లు. షేర్లు ఆగస్టు 6న ఎన్‌ఎస్‌ఈ, ఎంఎస్‌ఈలో లిస్ట్ కావచ్చు.
- ఉత్సవ్ సీజెడ్ గోల్ జ్యువెల్స్ ఐపీవో: ఈ ఇష్యూ జూలై 31న ప్రారంభమై, ఆగస్టు 2న ముగుస్తుంది. రూ. 69.50 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,04-,110. లాట్ పరిమాణం 1,200 షేర్లు. ఆగస్టు 7న ఎన్‌ఎస్‌ఈ, ఎస్‌ఎంఈలో షేర్లు లిస్ట్ చేయబడతాయి.
- ధరివాల్కార్ప్ ఐపీవో: ఈ ఇష్యూ కూడా ఆగస్టు 1న తెరవబడుతుంది. ఆగస్టు 5న ముగుస్తుంది. ఆగస్టు 8న ఎన్‌ఎస్‌ఈ, ఎస్‌ఎంఈలో షేర్లు లిస్ట్ కావచ్చు. ఈ ఐపీవో కోసం ధర, బ్యాండ్, లాట్ పరిమాణం ఇంకా ప్రకటించబడలేదు.