వాషింగ్టన్, ఆగస్టు 6: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో అభ్యర్ధిత్వం ఖరారైంది. డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను ఎంపిక చేసుకొన్నారు. పాఠశాల టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన అంచలంచెలుగా ఎదిగి మిన్నెసోటా గవర్నర్ అయ్యారు. మంక టోలో ఫుట్‌బాల్ కోచ్‌గా కూడా పనిచేశారు. ఎల్జీబీటీక్యూప్లస్ ఉద్యమానికి గట్టి మద్దతుదారు.
2006లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2018లో మొదటిసారి మిన్నెసోటా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. 2022లో రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యారు. డెమోక్రాటిక్ పార్టీ గవర్నర్ల అసోసియేషన్‌కు ఆయన చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆయన మిన్నెసోటాలో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత భోజన పథకాన్ని ప్రారం భించారు. కుటుంబ, మెడికల్ అవసరాలకు ఉద్యోగులకు పెయిడ్ లీవులు ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు.