మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తాలో ఆదివారం తిలక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు భవన కార్మికులకు, నిరుపేదలకు ఉచితంగా అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పేదలకు అల్పాహారాన్ని అందించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిలక్ వాకర్ సభ్యులు కంటే వాడ నగేష్, గెల్లి జయరాంయాదవ్, ముత్తి వెంకటరాజం, గరిగ రాజ్ కుమార్, గంట శ్రీను, భోగెశ్రీనివాస్, కందుల సత్తయ్య, కీర్తి మల్లేష్, డోలి సుకుమార్, ఎలిగేటి నరసింహులు, మేకల రాజయ్యను పాల్గొన్నారు