న్యూఢిల్లీ: హైదరాబాదీ యువ క్రికెటర్ తిలక్ వర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అక్టోబర్ 18 నుంచి 27 వరకు జరగనున్న పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసి యా కప్‌లో తిలక్ భారత జట్టును నడిపించనున్నాడు. అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ జట్టులో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ కూడా ఉన్నాడు. జట్టులో ప్రభ్‌సిమ్రన్, అనూజ్ రావత్, బదోని, రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, సాయి కిశోర్ వంటి ఐపీఎల్ స్టార్లు ఉన్నారు. గ్రూప్ ఉ న్న భారత్ తమ తొలి మ్యా చ్‌ను అక్టోబర్ 19న పాకిస్థాన్‌తో ఆడనుంది.