calender_icon.png 17 November, 2024 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సఫారీలకు ‘తిలక్’ ఝలక్

14-11-2024 01:41:32 AM

1 అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తొలి తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ.. 

  1. సెంచరీతో మెరిసిన తెలుగు తేజం
  2. మూడో టీ20లో భారత్ విజయం

సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సూర్య సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (107*) అజేయ సెంచరీతో కదం తొక్కగా.. ఓపెనర్ అభిషేక్ శర్మ (50) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో భారత్ నాలుగు టీ20ల సిరీస్‌లో 2 తేడాతో ముందంజలో నిలిచింది. రేపు చివరి టీ20 జరగనుంది.  తిలక్ వర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.  

సంజూ మరో ‘సారీ’ 

బంగ్లాతో చివరి టీ20తో పాటు ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ రెండో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి అందరినీ నిరాశపరిచాడు. మూడో టీ20లో కూడా అదే రీతిలో మరోమారు డకౌట్ అయి నిరాశపర్చాడు. మరి నాలుగో టీ20లో సంజూ ఏం చేస్తాడో.. 

రమణ్‌దీప్ ఎంట్రీ.. 

భారత జట్టులోకి రమణ్‌దీప్ సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. రమణ్‌దీప్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా క్యాప్ అందించాడు. రమణ్‌దీప్ ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్‌గా మలిచాడు. ఆవేశ్ ఖాన్ స్థానంలో రమణ్‌దీప్‌కు అవకాశం ఇచ్చారు. 

ఏళ్ల కళ.. 

ఎన్నో రోజుల నుంచి ఈ తరుణం కోసం వేచి చూస్తున్నా. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చాక ఇలా సెంచరీ చేయడం సంతోషానిచ్చింది. నేను, అభిషేక్ ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నాం. 

-తిలక్ వర్మ, హైదరబాదీ  క్రికెటర్