calender_icon.png 12 February, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దగట్టు జాతరకు పటిష్ట భద్రత

12-02-2025 12:00:00 AM

  • వాహనాల మళ్లింపుకు ప్రత్యేక చర్యలు
  • పార్కింగ్‌కు రూట్‌మ్యాప్ సిద్ధం
  • మూడు విడతల్లో 24 గంటలపాటు పోలీస్ బందోబస్తు
  • భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్

సూర్యాపేట ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్టంలోనే రెండవ అతిపెద్ద జాతర దురాజుపల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 16 నుండి ఐదు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో జాతీయ రహదారి 65 పై  వాహనాల మళ్లింపు నకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

వాహనాల మళ్లింపు తో పాటు జాతరకు వచ్చే భక్తుల వాహనాలకు పార్కింగ్ స్థలాలకు సంబంధించి రహదారి మర్గాలను సిద్దం చేశామన్నారు. జాతర నేపథ్యం లో ఐదు రోజులు మూడు విడతల్లో 24 గంటలు పోలీసు బందోబస్తు నిర్వహిస్తామని, భక్తులు పోలీసు శాఖ సూచన లు పాటిస్తూ తమకు సహకరించాలన్నారు. 

వాహనాల మళ్లింపు ఇలా..

జాతర సందర్భంగా ఈనెల 16 తెల్లవారుజామున నుండి జాతీయ రహదారి 65 పై వాహనాల మళ్ళింపు ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు మళ్ళీంపులను గమనించా లన్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్ళే వాహ నాలను నార్కట్‌పల్లి నుంచి నల్గొండ వైపుగా మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా విజయవాడకు పంపిం చడం జరుగుతుందని, అలాగే విజయవాడ నుండి హైదరా బాద్ వెళ్ళే వాహనాలను, కోదాడ నుంచి హుజూర్నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా హైద్రాబాద్ మళ్ళించడం జరుగుతుందన్నారు.

దీంతో పాటుగా హైద్రాబాద్ నుండి ఖమ్మం వెళ్ళే వాహనాలను టేకుమట్ల నందు ఉన్న జాతీయరహదారి 365 మీదుగా, సూర్యాపేట నుంచి కోదాడ వెళ్ళే వాహనాలను కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే విధంగా,

సూర్యాపేట పట్టణం నుండి కోదాడ వెళ్ళే  వాహనాలను కుడ కుడ మీదుగా ఐలాపురం నందు ఉన్న ఖమ్మం జాతీయరహదారిలోని రాఘవపురం స్టేజి నుండి నామవరం గ్రామం మీదుగా జాతీయరహదారి 65 పై గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపుకు పంపించడం జరుగుతుందన్నారు. జాతరకు వచ్చు భక్తుల వాహనాల పార్కింగ్ నిమిత్తం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

మొదటి పార్కింగ్ ప్రదేశం.. 

సూర్యాపేట మీదుగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలను జాతీయ రహదారి 65 మీద గల పెట్రోల్ బంక్ నుండి రాంకోటి తండాకు వెల్లు మార్గంలో వాహనాల పార్కింగ్‌కు ద్విచక్ర వాహనాలను, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఏర్పాటు.

రెండో పార్కింగ్ ప్రదేశం..  

గరిడేపల్లి, పెనపహడ్ వైపుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను కలక్టర్ పాత కార్యాలయం వెనుక గల స్థలంలో భారి పార్కింగ్ స్థలం ఏర్పాటు.

మూడో పార్కింగ్ ప్రదేశం.. 

 కోదాడ, మునగాల, గుంపుల వైపుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను ఖాసింపేట గ్రామం వెల్లు మార్గంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు.

నాలుగో పార్కింగ్ ప్రదేశం.. 

మోతే, చివ్వేంల మీదుగా జాతరకు వచ్చే భక్తుల వాహ నాలను చివ్వేంల మీదుగా మళ్లించి మున్యానాయక్ తండా వద్ద (గట్టుకు వెనకాల) పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగినదని ఎస్ పీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.