27-02-2025 01:00:52 AM
ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
నిర్మల్, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి) ః నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ పరంగా భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని నిబంధనలు అందిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఎన్నికల్లో విధులు నిర్వహించి పోలీస్ సిబ్బందికి ఎన్నికల నియా మావళి భద్రతా చర్యలు శాంతిభద్రతలు తదితరు అంశాలపై వివరించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేం దుకు ఓటర్లు రాజకీయ పార్టీల నేతలు ఉద్యోగులు సహకరించాలని సూచించారు. జిల్లా లో 46 పోలింగ్ కేంద్రాల్లో 200 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించడం జరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వెబ్ కాస్టింగ్ ఉంటుందని నిఘా కెమెరా పరిశీలిస్తామని తెలిపారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే పై స్థాయి అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావే శంలో ఏఎస్పీలు అవినాష్ కుమార్ రాకేష్ మీనా ఉపేందర్ రెడ్డి సిబ్బంది ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాం తి) : జిల్లాలో ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 400 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ అలం తెలిపారు. స్థానిక టీటీడీసీ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లను బుధవారం జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 పోలింగ్ లోకేషన్లు 39 పోలింగ్ స్టేషన్ లో ప్రత్యేకంగా 8 రూట్లలో ఏర్పాటు చేసిన మొబైల్ రూట్ పార్టీలు, స్పెషల్ స్ట్రుకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాట్స్, క్యూఆర్టి స్ట్రుకింగ్ ఫోర్స్, ఇద్దరు డీఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రుకింగ్ ఫోర్స్ లను ప్రత్యేకంగా జిల్లావ్యాప్తంగా నిఘా బృందాలను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి అయ్యేలా బందోబ స్తు ప్రక్రియను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అదనపు ఎస్పీ, డిఎస్పీ, సీఐలు ఉన్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లఘించిన వారిపై చర్యలు డీఎస్‌పీ రామానుజం రూ.21.50 లక్షల మద్యం పట్టివేత
చింతలమానేపల్లి, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిం చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పి రామానుజం తెలిపారు. చింతలమానపల్లి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.21.50 లక్షల మద్యాన్ని పోలీసులు దాడులు చేసి స్వాధీనపరుచుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి మాట్లాడుతూ 27న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపులను ప్రభుత్వం ఆదేశాల మేరకు మూసి వేయడంతో ముందస్తుగానే శ్రీనిధి వైన్ షాప్ యజమాని కొడిపాక సత్యనారాయణ భారీ ఎత్తున మద్యాన్ని అక్రమం గా నిల్వ ఉంచి తన షాపులో పనిచేస్తున్న వ్యక్తి ద్వారా నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతుండగా పక్క సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
పెద్ద మొత్తంలో మద్యం పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ రమేష్ , ఎస్సులు నరేష్, ప్రవీణ్, మధుకర్, ఏఎస్‌ఐ మను సిబ్బంది విజయ్, తిరుపతి, దినకర్, మహేష్ , ఆనంద్ లను ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధం కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) ః నిర్మల్ జిల్లాలో నిర్వహించే ఎమ్మెల్సీ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎన్నికల పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించి ఉద్యోగులకు సామాగ్రి పంపిణీ చేసి పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియను పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 191 71, ఓటర్లు ఉన్నారని తెలిపారు.
ఇందులో పట్టబద్రులు 17 0 41 ఉపాధ్యాయులు 19 66 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అన్నారు. జిల్లాలో 46 పోలింగ్ కేంద్రాలను ఎనిమిది మంది రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:00 వరకు ఓటింగ్ను ప్రశాంతంగా నిర్వహించినందుకు అధికారులు సహకరించా లని సూచించారు. ఎన్నికల రూల్ ప్రతి ఒక్కరు పాటించాలని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్డీవోలు ఉన్నారు.
ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధిత అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. 27న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుండి బ్యాలెట్ బాక్స్ లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ అధికారులు కేంద్రాలకు పెళ్లి ఎందుకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పా టు చేశారు. పోలింగ్ కేంద్రాల వెళ్లే వాహనాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తో కలిసి జండా ఊపి ప్రారంభించారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎం. ఎల్. సి. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణ కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా యని తెలిపారు. జిల్లాలో పట్టబద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించి మొత్తం 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ డివిజన్లలో మొత్తం 6607 మంది ఓటర్లు ఉండగా ఇందులో 6 వేల 137 మంది పట్టబద్రులు, 470 మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు 19 మంది ప్రిసైడింగ్ అధికారులు, 87 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు, 17 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగిందని తెలిపారు. ఆర్డిఓ లోకేశ్వర రావు , డిఆర్డిఓ దత్తారావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పోలింగ్‌కు సర్వం సిద్ధం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్‌డిఓలు శ్రీనివాస్ రావు, హరికృష్ణలతో కలిసి కలక్టరేట్‌లో గల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని, ఇందు కొరకు ర్యాండమైజేషన్‌లో కేటాయించిన ప్రకారంగా ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో 60 మంది ప్రిసైడింగ్ అధికారులు, 181 మంది పోలింగ్ అధికారులు, 25 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. జిల్లాలో ఉపాధ్యాయ ఎన్నికకు 18 పోలింగ్ కేంద్రాలు, పట్టభద్రుల ఎన్నికకు 40 పోలిం గ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో 8 కామన్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.