calender_icon.png 5 March, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ట బందోబస్తు

03-03-2025 12:00:00 AM

కరింనగర్ క్రైమ్ , మార్చి 2 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీ సోమవారంనాడు స్థానిక కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం నందు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ ఎన్. వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ బందోబస్తుకు గాను ఒక అడిషనల్ డీసీపీ అధికారితో పాటు , ఆరుగురు ఏసీపీలు , 18 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్సులతో సహా మొత్తం 400 మంది పోలీసులు ఓట్ల లెక్కింపునకు బందోబస్తులో పాల్గొననున్నారని టౌన్ ఏసీపీ తెలిపారు.