29-03-2025 08:32:18 PM
రామయంపేట (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల వద్ద రామాయంపేట పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు కాకుండా ఎవరు వచ్చిన లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. మాస్ కపింగ్ పాల్పడకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల మాస్ కపింగ్ అవకాశం ఉండదని మంచి లక్ష్యంతో చదువుకొని ఉత్సాహంగా పరీక్షలు రాసే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.