22-03-2025 01:25:40 AM
- జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి టౌన్ మార్చి-21: వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న పదవ తరగతి వార్షిక పరీక్ష కేంద్రాలు సరస్వతి శిశు మందిర్ స్కూల్, హరిజనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రం నందు పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలు అడిగి తెలుసు కున్నారు.బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద బిఎన్‌ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.ఈ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సీఐ, కృష్ణ, వనపర్తి పట్టణ ఎస్త్స్ర,హరిప్రసాద్, పోలీస్ అధి కారులు సిబ్బంది పాల్గొన్నారు