గజ్వేల్, జనవరి 30: సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి తెలిపారు. గురువా రం ఆయన వర్గల్ విద్యాసరస్తి క్షేత్రాన్ని పరిశీలించారు. ఫిబ్రవరి 3న వసంత పం చమి సందర్భంగా 50 వేలకు పైగా భక్తు లు దర్శనానికి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా అవసరమైన చర్యలపై ఆలయ ని ర్వాహకులతో చర్చించారు.
ప్రత్యేక దర్శనం, సాధారణదర్శనం, అక్షరాభ్యాసా ల కోసం క్యూ లైన్ల ఏర్పాటు, వాహన పార్కింగ్, మహా ప్రసాద నిర్వహణ తదితర అంశాల గురించి ఆలయ పరిసరాలను పరిశీలించి తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయం చుట్టూ సీసీ కెమె రాలతో భద్రత చర్యలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఏసిపి పురుషోత్తం రెడ్డి వెంట రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్సు కరుణాకర్ రెడ్డి ఉన్నారు.