26-02-2025 01:03:18 AM
కలెక్టర్ అద్వుతై కుమార్ సింగ్
మహబూబాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు పదవ తరగతి పరీక్షల పకడ్చరదీ జరిగే విధంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వుతై కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 నుండి 12.30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు, పరీక్షల నిర్వహణకు చీఫ్ సుపర్డెంట్స్ 46 మంది, డిపార్ట్మెంట్ అధికారులు 46 మంది, 11 మంది జిల్లా అధికారులను నియమించడం జరిగిందనీ, జిల్లాలో 4,189 మంది బాలురు, 4,005 మంది బాలికలు మొత్తం 8,194 విద్యార్థినీ, విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో మహబూబాబాద్, తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు కె.కృష్ణవేణి, జి.గణేష్, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మురళీధర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదర్, డిపిఓ హరిప్రసాద్, ప్రోగ్రాం అధికారి శ్రీరాములు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.