21-03-2025 12:00:00 AM
గూడూరు ఎసై గిరిధర్ రెడ్డి
మహబూబాబాద్. మార్చి 20: (విజయ క్రాంతి) పదవ తరగతి వార్షిక పరీక్షలు నేటి నుండి ప్రారంభం అవుతుండగా పోలీసులు పగడ్బందీగా భారీ భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు. కాగా పదవ తరగతి పరీక్షలు నిర్వహి స్తున్న కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎక్కడ గుంపులు గుంపులుగా ఉండకూడదని ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు పరీక్ష ముగిసే వరకు తెరవద్దని ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. మహబూబాబాద్ జిల్లా లోని గూడూరు మండల వ్యాప్తంగా మూడు పరీక్ష కేంద్రాలు ఉండనుండగా 510 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
కాగా గూడూరు మండల కేంద్రంలోని 14 స్కూల్లలో నుండి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. అదేవిధంగా సెంటర్లలో ఎప్పటికప్పుడు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.