13-03-2025 12:38:16 AM
పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, మార్చి 12(విజయక్రాంతి): ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్‌కు రానుండగా అందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం శివునిపల్లి శివారులో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీవోలు వెంకన్న, గోపీరామ్‌తో కలిసి పర్యవేక్షించారు.
హెలీప్యాడ్, సభా స్థలికి సంబంధించిన మ్యాప్ ను పరిశీలించి, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. డయాస్, పోడియమ్స్, రైలింగ్‌లు, పార్కింగ్ స్థలం వద్ద, సభా ప్రాంగణానికి కొంచెం దూరంలో తాగునీటి సౌకర్యం, నీడ కోసం షామియానాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాల న్నారు.
ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఔషధాలు సరిపడా, ముందస్తు జాగ్రత్తలో భాగంగా అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అందుబాటులో ఉంచాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్‌ఈ వేణుమాధవ్, డీఆర్డీ ఏ వసంత, డీపీఓ స్వరూప, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.