*పులి దాడిలో మూడు దూడల మృతి
ఆదిలాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పులి దాడిలో ఆది జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి శివారులో మూడు దూడలతోపాటు పంది మృత్యువాతపడ్డాయి. శని వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు ఈ విషయాన్ని గమనించారు.
సమాచారం అందు తాంసి మండల బీట్ ఆఫీసర్ సాయి, యానిమల్ ట్రాకర్ సోనేరావుతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. తాంసి (కే) గ్రామంలో పులి పాద ముద్రలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీట్ ఆఫీసర్ సాయి సూచించారు.
కొత్తగూడ రాంపూర్‌లో పులి!
మహబూబాబాద్(విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పులి సంచారంతో బేంబేలెత్తిన ప్రజలు.. పులి వెళ్లిపో అధికారులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రాం అటవీ ప్రాంతంలో జిల్లా అటవీశాఖ అధికారి విశాల్, ఎఫ్‌డీవో చంద్రశేఖర్, కొత్తగూడ రేంజ్ ఆఫీసర్ వజహత్ కలిసి మగపులి ఆనవాళ్లను గుర్తించారు.
ప్రస్తుతం పులి కన్నగండి, కామారం, గుండాలవైపు లేదా ములుగు, నర్సంపేట ప్రాంతాల్లో ఉన్నట్లు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పులి కదలికలపై నిఘా పెట్టాలని డీఎఫ్‌వో విశాల్ తెలిపారు.