calender_icon.png 27 December, 2024 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులి జాడ లభ్యం

02-12-2024 12:31:05 AM

ఇటిక్యాల్ పహాడ్ ప్లాంటెషన్‌లో గుర్తింపు

100 మంది ట్రాకర్లు, డ్రోన్ల సహాయంతో వెతుకులాట

కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలో పులి ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. పులి దాడి చేయడంతో కాగజ్‌నగర్ మండలంలో మహిళ మృతి చెందగా సిర్పూ ర్ టి మండలంలోని రైతు తీవ్రంగా గాయపడ్డాడు. పులి జాడ కోసం అటవీశాఖ అధి కారులు సిర్పూర్ రేంజ్ పరిధిలో గత మూ డు రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నారు. 100 మంది ట్రాకర్స్ నియమిం చడంతో పాటు ప్రత్యేకంగా డ్రోన్లతో వెతుకున్నారు.

సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం సిర్పూర్ రేంజ్ పరిధిలోని ఇటిక్యాల్ పహాడ్ ప్లాటెంషన్ వద్ద పులి పాద ముద్రలను అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పది బృందా లను ఏర్పాటు చేసి సమీప గ్రామాల్లో అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా పెంచికల్‌పేట్ మండలంలోని దుర్గపల్లి గ్రామసమీపంలో ఆదివారం రాత్రి గెదేపై పులి దాడి చేసింది. ఈ విషయం తెలియడం తో ప్రజలు అందోళన చెందుతున్నారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పులుల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్ కన్జర్వేటర్ ఇలుసింగ్ మేరు సూచించారు. ఆదివారం సిర్పూర్ డివిజన్‌లోని ఇటిక్యాల్ పహాడ్ గ్రామంలో కన్జర్వేటర్ శాంతారాం, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవల్, ఫ్లయింగ్ స్కాడ్ వేణుబాబుతో కలసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వే టర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వీయ రక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు.

ఒంటరిగా అటవీ ప్రాం తంలో తిరగవద్దని కోరారు. ప్రస్తు తం పులులు ఆవాసం కోసం సం చారం చేస్తున్నాయని ఈ క్రమంలోనే ఆటవీ ప్రాంత సమీపంలో తిరుగుతున్నాయన్నారు. రైతులు గుంపులుగానే పొలం పనులకు వెళ్లాలని సూచించారు. పొలం పనులకు వెళ్లే రైతులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి అన్ని వైపులా గమనిస్తుండూ ఉండాలని ఆయన సూచించారు.

అంతేకాకుండా ప్రతి ఒక్కరు తప్పకుండా తలకు వెనుక భాగంలో మాస్కులు ధరించాలని సూచించారు. మాస్కులు ధరిస్తే పులి దగ్గరకు రాదని చెప్పారు. అనంతరం గ్రామస్థులకు మాస్కులను పంపిణీ చేశారు.