calender_icon.png 28 December, 2024 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులిజాడ లభ్యం...

01-12-2024 10:54:05 PM

సిర్పూర్ రేంజ్ ఇటిక్యాల్ పహాడ్ ప్లాంటేషన్ వద్ద పులి పంగ్ మార్క్ గుర్తించిన అధికారులు 

వందమంది ట్రాకర్స్, డ్రోన్ల సాయంతో వెతుకులాట 

సమీప గ్రామాలలో 10 బృందాలతో అవగాహన కార్యక్రమాలు 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో బెబ్బులి ప్రజలకు కంటినిండా నిద్ర లేకుండా చేస్తుంది. ఇటీవల మహిళపై దాడి చేయగా మృతి చెందిన సంఘటనతో పాటు మరో రైతుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకొని విస్తృతంగా పులిజాడ కోసం వెతుకుతున్నారు. వందమంది ట్రాకర్స్ తో పాటు ప్రత్యేక డ్రోన్లతో వెతుకులాట మొదలు పెట్టగా ఆదివారం ఇటిక్యాల్ పహాడ్ ఆటవిశాఖ ప్లాంటేషన్ లో పులి పంగ్ మార్క్ ను అధికారులు గుర్తించారు.

అప్రమత్తమైన అధికారులు సమీప గ్రామాలలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పులిజాడ కనుగొన్న అధికారులు ఊపిరి పెంచుకోగా ఆదివారం రాత్రి పెంచికల్పేట్ మండలం దుర్గపల్లి శివారులో గేదెపై పులి దాడి చేసిన సంఘటనతో ఫారెస్ట్ అధికారులు హులుక్కుమన్నారు. పులి దోబూచులాటతో ఫారెస్ట్ అధికారులతో పాటు ప్రజలు ఆందోళ చెందుతున్నారు. జిల్లాలో ఎన్ని ఎన్ని పులులు సంచారం చేస్తున్నాయో తెలియక ఆటవిశాఖ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.