అధికారికంగా ధ్రువీకరించిన అటవీశాఖ అధికారులు.
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్(Amrabad Tiger Reserve Forest) ఫలహాబాద్ ప్రాంతంలో శనివారం ఉదయం పెద్దపులి మళ్లీ పర్యాటకుల కంటపడింది. ఉదయం వ్యూ పాయింట్ కోసం సఫారీ వెహికల్ పైన ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పెద్దపులి మరోసారి కంటపడడంతో పర్యాటకులు(Tourists) వారి సెల్ఫోన్లో చిత్రాలను బంధించారు. ఈ విషయాన్ని మన్ననూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికుమార్ అధికారికంగా ప్రకటించారు. గత వారం రోజుల క్రితమే మరో పెద్దపులి పర్యాటకులకు కంటపడిన విషయం తెలిసిందే. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలోనే తరచు పర్యాటకులకు పెద్ద పులులు కంటపడుతున్నాయని పేర్కొన్నారు.