ఆదిలాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరోమారు పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జైనథ్ మండలంలోని కరంజి గ్రామ శివారులో మంగళవారం పెద్దపులి సంచరించినట్లు గ్రామస్థులు తెలుపడంతో అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి వెళ్లారు. పులి సంచరించిన ప్రాంతాల్లో పులి పాదముద్రలను గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు రాథోడ్ రాజేందర్, గులాబ్ సింగ్ తెలిపారు.
తెలంగాణ సరిహద్దులోని పెన్‌గంగా నది తీరం నుంచి జైనథ్ మండలంలోని కరంజి గ్రామ శివారులోకి వచ్చి ఉం అధికారులు పేర్కొన్నారు. జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం కరంజి, కాప్రి గ్రామాల్లో పులి జాడ కోసం గాలింపు చేపట్టారు. జైనథ్, బేలా మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.