అప్రమత్తమైన అటవీశాఖ...
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో పులి సంచారం అన్న వార్త తెలియగానే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరిస్తున్న సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. పినపాక మండలం పోట్లపల్లి అడవి ప్రాంతంలో పులి సంచరిస్తున్న సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలు, ఇతర ఆధారాలను అన్వేషిస్తున్నారు. అన్వేషణలో ఎఫ్డిఓ సయ్యద్ మల్సూర్, రేంజర్ ఉపేందర్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.