* అమృతగూడలో గుర్తించిన వాహనదారులు
* సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన ఫారెస్ట్‌శాఖ
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం ఏజెన్సీవాసులను కలవరపెడుతున్నది. తాజాగా గురువారం మహారాష్ట్ర సరిహద్దులోని సిర్పూర్ (టీ) మండలం అమృత్‌గూడ ప్రధాన రహదారి పక్కన పెద్దపులి నడుచుకుంటూ వెళ్తూ వాహనదారు లకు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ విషయం సమీప గ్రామాల ప్రజలకు తెలిసి భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి ఏజెన్సీవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పులి దాడి చేసిన ఘటనలో ఇప్పటికే జిల్లాలో ఒకరు మృతిచెందగా, మరో వ్యక్తి గాయాల పాలయ్యాడు. అలాగే అనేక మూగజీవాలపైనా పులులు దాడి చేసిన ఘటనలున్నాయి.
ఇప్పటికే సిర్పూర్ కాగజ్‌నగర్ అటవీప్రాంతాన్ని పులల కారిడార్‌గా ఫారెస్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఎనిమిది పులులు సంచరిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.