calender_icon.png 2 February, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న బుగ్గ ప్రాంతంలో జంట పులులు?

02-02-2025 12:05:20 PM

హడలెత్తి పోతున్న స్థానికులు

బెల్లంపల్లి, (విజయక్రాంతి): కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతంలో నాలుగు రోజులుగా పెద్దపులి సంచారం భయాందోళనలు రేకెత్తిస్తుండగా తాజాగా ఆదివారం చిన్న బుగ్గ అటవీ ప్రాంతంలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో చిరుత పులి, సమీపంలోని సమ్మక్క గద్దెల వద్ద పెద్దపులి కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో బెల్లంపల్లి ప్రాంతంలో ఆందోళన నెలకొంటుంది. ఆ ప్రాంతంలో వాకింగ్ కు వెళ్లిన పలువురితో అటవీ సిబ్బంది పులులకు సంబంధించిన సమాచారం ఇచ్చి ఈ ప్రాంతంలో వాకింగ్ చేయవద్దని సూచించినట్లు తెలిసింది.

ఫైరింగ్ రేంజ్ సమ్మక్క గద్దల వద్ద కనిపించిన పెద్దపులి బీ2 అయ్యుంటుందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ప్రాంతంలో చిరుత పులి కూడా సంచరిస్తుండడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం జంట పులుల జాడ కోసం అన్వేషిస్తున్నారు. గత మూడు నెలల కిందట కాసి పేట అటవీ ప్రాంతంలో చిరుత పులి మేకల పై దాడి చేసింది. ప్రస్తుతం కాసిపేట అడవుల నుండి చిరుత పులి చిన్న బుగ్గ ఫైరింగ్ రేంజ్ ప్రాంతానికి వచ్చి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పులుల సంచారం అటవీ అధికారులకు సవాల్ గా మారింది.