calender_icon.png 30 October, 2024 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిపేటలో పులి కలకలం

30-10-2024 01:41:25 AM

మంచిర్యాల, అక్టోబర్ 29 (విజయక్రాం తి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. సోమవారం రాత్రి పులి.. గొర్రెల మందపై దాడి చేయగా ఓ జీవం మృతిచెందింది. గుడిపే సమీపంలోని బుగ్గగట్టు అటవీ ప్రాంతాన్ని అనుకొని ఉన్న మామిడి తోటలో గొర్రెల కాపరులు గొర్రెల మందను ఉంచారు. అర్ధరాత్రి పెద్దపులి అక్కడికి వచ్చి గొర్రెల మందపై దాడి చేయడంతో ఓ గొర్రెను చంపింది.

మరో గొర్రెను తన వెంట తీసుకెళ్లింది. కాపరులు మంగళవారం తెల్లవారుజాము వరకు బిక్కుబిక్కుమంటూ గడిపి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు గ్రామానికి వచ్చి మామిడి తోట ప్రాంతంలో పులి పాద్ర ముద్రల నమూనాలు సేకరించారు. గొర్రెలపై దాడి చేసింది చిరుతపులి  అని.. పెద్దపులి అయి ఉండకపోవచ్చని ఫారెస్ట్ సిబ్బంది వెల్లడించారు.