calender_icon.png 27 December, 2024 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం

26-12-2024 02:48:17 PM

హైదరాబాద్: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి) మండలం అమృతగూడ గ్రామం వద్ద గురువారం రోడ్డుపై పులి కనిపించడం కలకలం రేపింది. అమృతగూడ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. గ్రామ శివారులో రోడ్డుపై వెళుతుండగా పులి ప్రత్యక్షమై రైతులు, వాహనదారులను భయాందోళనకు గురి చేసింది. చూపరుల శబ్దం విన్న పులి రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి వెళ్లింది. పులిని లోతట్టు అడవుల్లోకి మళ్లించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. రైతులు వ్యవసాయ పోలాల్లోకి అడుగుపెట్టేందుకు వెనుకాడుతున్నారని అన్నారు.

పులి రోడ్డుపై వెళ్తుండగా స్థానికులు కొందరు వీడియో రికార్డ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ నుండి ఒక పులి భూభాగాన్ని వెతుకుతూ, సంభోగం కోసం భాగస్వామిని వెతుక్కుంటూ తెలంగాణ వైపు మళ్లి ఉండవచ్చని అటవీ అధికారులు తెలిపారు. పులి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.