calender_icon.png 21 September, 2024 | 6:11 PM

బోను తాళం తీసి.. బయటికొచ్చిన.. పులి!

19-09-2024 01:44:52 PM

అడవిలో స్వేచ్ఛగా తిరగాల్సిన పులిని పాపం బోన్ లో బంధించడమే..ఒక మూర్ఖత్వం.. పోనీ అక్కడైనా ప్రశాంతంగా ఉండనిస్తే చాలు.. కానీ పులి బోనులోనే ఉంది కదా అని కొంతమంది ఆకతాయిలు ఏ మాత్రం జీవకారుణ్యం లేకుండా కెలకడం.. సెలకడం.. లాంటి పరాచికాలకు పాల్పడుతూ ఉంటారు. తాజాగా బోన్ లో బందీగా ఉన్న పులి తాళం పగులకొట్టుకుని మరీ బయటకు వచ్చిన ఘటన తాలూకు వీడియో ఇన్ స్టాగ్రమ్ లో షికారు చేస్తోంది. ఈ వీడియోకు 1.7 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. తాళం కప్పను నోటితో పట్టుకుని లాగుతూ దానిని బలంగా లాగింది. తదనంతరం తలుపు తీసుకుని బయటకు వచ్చింది. కాగా ఆ కప్పను పులే తనంత తానుగా బద్దలు కొట్టి బయటకు వచ్చిందా ? లేక ఎవరైనా సాయం చేశారా? అన్న విషయంలో స్పష్టత లేదు.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పులికి ఉన్న శక్తిని చూస్తూంటే ఆశ్చర్యమేస్తుందని ఒక నెటిజనుడు వ్యాఖ్యానించాడు. ప్రకృతిలో ఇంత బలముందా? ప్రకృతిలో ఇంత బలముందా? అని ఇంకో యూజర్ ఆశ్చర్యపోయాడు. పులులు ఎంత భయంకరమైనవో మరోమారు తెలిసి వచ్చిందని ఇంకో యూజర్ రాసుకొచ్చాడు. పులి బోనులో ఉంది కదా.. అని ఇకపై నిశ్చింతగా ఉండడానికి వీల్లేదని మరో వ్యక్తి భయం వ్యక్తం చేశాడు. మీరు కూడా వీడియో చూసి జీవకారుణ్యంపై మీ హృదయ స్పందన తెలియజేయండి  నెట్టింట అభిప్రాయాలను వ్యక్తం చెయ్యండి.