calender_icon.png 28 December, 2024 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల నిర్లక్ష్యంతోనే పులి దాడులు

03-12-2024 01:01:40 AM

ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం తోనే పులి దాడులకు పాల్పడుతున్నదని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు విమర్శించారు. సోమవారం తన నివాసంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అటవీ రక్షణ, పులుల సంరక్షణపై దృష్టి పెట్టాల్సిన ఫారెస్ట్ అధికారులు అక్రమ సంపాదనపై దృష్టి పెట్టారని ఆరోపించారు.

పులుల దాడుల్లో మనుషులు చనిపో వడం ఫారెస్ట్ అధికారుల అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. గత రెండేళ్లలో పులుల దాడుల్లో నలుగురు, ఏనుగు దాడి లో ఇద్దరు మృతి చెందారని చెప్పారు. మృ తుల కుటుంబాలకు ఇప్పటి వరకూ పూర్తిస్థా యి నష్టపరిహారం అందలేదన్నారు. రేడియో కాలరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే పులుల జాడ తెలుసుకోవడం సులభరతం అవుతుందన్నారు.

అనంతరం ఇటీవల పులి దాడిలో మృతి చెందిన లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మి కుటుంబానికి మరో రూ.10 లక్షలు, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, మాజీ కౌన్సిలర్లు విశ్వేశ్వర్, సిందం శ్రీనివాస్, బాల్క శ్యామ్ తదితరులు ఉన్నారు.