ఆదిలాబాద్ అడవుల్లో సంచారం
ఆదిలాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఆదిలాబాద్ అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలో పులి కదలికలతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నా యి. తాజాగా బోథ్ మండలంలో పెద్దపులి కలకలం రేపింది. మండలంలోని ఘన్పూర్ గ్రామ శివారు లోని అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ జింకపై పెద్ద పులి దాడి చేసి చంపేసింది. దీంతో ఆయా గ్రా మాల ప్రజలు భయాందోళనకు గు రవుతున్నారు. అటవీశాఖ అధికారు లు పులిని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.