calender_icon.png 1 April, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌంటర్‌లో కొన్న టికెట్లు ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయొచ్చు

30-03-2025 12:12:53 AM

రీఫండ్ కోసం రిజర్వేషన్ కేంద్రాలకు వెళ్లాల్సిందే..

స్పష్టం చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులు కౌంటర్‌లో కొన్న టికెట్లను ఇకపై ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. శనివారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులు ఇబ్బందులను గమనించి ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా 139కి ఫోన్ చేసి టికెట్ రద్దు చేసుకోవచ్చన్నారు. అయితే రీఫండ్స్ కోసం మాత్రం రిజర్వేషన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. తాము తీసుకుంటున్న చర్య వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది రైలు ప్రయాణికుల సమయం, శ్రమ ఆదా అవుతుందని భావిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలను డిజిటలైజేషన్ వైపు తీసుకువెళ్లాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.