calender_icon.png 19 March, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో నెలరోజుల్లో తునికాకు సేకరణకు సిద్ధం

17-03-2025 12:00:00 AM

తునికాకు మోడెం కొడుతున్న గిరిజనులు

చర్ల, మార్చి 16 (విజయ క్రాంతి): చర్ల మండల వ్యాప్తంగా అటవీ శాఖ అధికారుల ఆదేశానుసారం ఆదివాసి గిరిజనులు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి తునికి చెట్టు మోడం కొట్టి తునికాకు చిగురు మొలిచేలా సిద్ధం చేస్తున్నారు , ఏజెన్సీలోని  అడవి ప్రాంతంలోని గిరిజనుల ప్రధాన అటవీ ఆధారిత సంపాదనలో తునికాకు అతి ప్రధానమైనది ప్రతి ఏటా తునికాకు చర్ల మండలంలో ఐదు కలలు ఏర్పాటు చేసి ఆ కల్లాల ద్వారా తునికాకు సేకరిస్తారు అయితే తునికాకు చిగురించేలా ఉన్న మొక్కలను మోడులను  కొట్టి అటవీ ప్రాంతమంతా తునికాకు మొక్కలలో తొలకరి ఆకులు చిగురించేలా ఆదివాసి గిరిజనులు ప్రతియేటా పదవి ప్రాంతాల్లోని తునికాకు మోడం  కొడుతూ ఉంటారు, ఇలా అటవీ ప్రాంతంలోని తునకకు  మూడెం కొట్టినందుకుగాను కందిపాడు గిరిజన గ్రామస్తులకు అధికారులు 20వేల రూపాయలు ఇస్తున్నారని ఈ క్రమంలో ఆదివాసులు అంతా కలిసి అటవీ ప్రాంతంలోని తునికాకు మోడెం  కొడుతూ కందిపాడు అటవీ ప్రాంతం మొత్తం గ్రామస్తులంతా కలిసి  తమ జీవనోపాధికి ఉప యోగపడే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తునికాకు మద్దతు ధర ఇవ్వాలి 

గత ఏడాది తునికాకు కట్టకు మాత్రమే ఇచ్చారని దాంతో ఖేజనులు తక్కువ డబ్బు వస్తుందని వాపోయారు ఏదైనా ఐదు రూపాయలు చేసి మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కాలానుగుణంగా తమ  జీవనోపాధి కొనసాగించి అటవీ ఉత్పత్తులను వినియోగించుకోవడం తాము ప్రతి సంవత్సరం తునికాకు సేకరణ చేస్తామని అడవుల ఆధారంగా వారి జీవన శైలి విధానం ఉంటుందని ఉదయం ఐదు గంటలకే లేచి తునికాకు సేకరణకు వెళ్లి ఆకు సేకరణ చేసి కట్టలు కట్టి కల్లాలకు తీసుకువెళ్లి డబ్బులు సంపాదించుకుంటామని ఈ సీజన్లో తునికాకుతో పాటు మరికొద్ది రోజుల్లో ఇప్ప పువ్వూ కూడా దొరుకుతుందని ఇవి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరి పుత్రులకు ఇది ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుందని అత్యధికంగా గిరిజన ప్రాంత ఆదివాసీలు  ఈ ప్రాంతం యొక్క తునికి పళ్ళు, తునికి ఆకు, ఇప్ప పువ్వు ద్వారా ఒక రూపాయి సంపాదించుకునేందుకు అవకాశం ఉందని, కానీ గత ఏడాదిలా ఈ ఏడాది తునికాకు  తక్కువగా దొరుకుతుందని అయితే మద్దతు ధర ఐదు రూపాయలకు గా  పెంచితే మేము మరింత కష్టపడి గుట్టలను వెక్కి  తునికాకు సేకరిస్తామని ఈ సందర్భంగా కందిపాడు గ్రామపంచాయతీ గిరిజన ఆదివాసి కోవ్వాసి సోమరాజు  చెప్తున్నారు, మోడెం కొట్టే వారికి తాగునీరు అందిస్తూ సహాయం చేస్తామని  పాములు, విషపురుగులు విషకాటకాలు క్రూరమృాగాలు వంటి వాటిని పట్టించుకోకుండా ప్రాణాలు తెగించి తునికాకు సేకరణ కోసం కష్టపడతామని  కందిపాడు గ్రామం పెద్దమనిషి మాడి దేవయ్య చెప్పుకొస్తున్నారు