calender_icon.png 11 January, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీని వణికించిన పిడుగులు

12-07-2024 12:46:27 AM

ఒక్కరోజులోనే పిడుగుల వల్ల 38 మంది మృతి

వచ్చే ఐదురోజులు కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడే చాన్స్

లక్నో, జూలై 11: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఒక్క రోజులోనే 38 మంది మృత్యువాత పడ్డారు. సామాన్య జనం అతలాకుతలం అవుతున్నా రు. ఒక ప్రతాప్‌గఢ్ ఏరియాలోనే 11 మంది చనిపోయారు. సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలిలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు, డియోరి యా, హత్రాస్, వారణాసి, ఔరియా జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ పిడుగుల వల్ల అనేక మంది కాలిన గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఐదు వేర్వేరు ప్రాంతాల్లో మరణాలు సంభవించాయి. 

అందుకే అక్కడ మరణాలు.. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో అనేక మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. చాలా మంది పొలాలకు వెళ్తారు. ఇలా వెళ్లినపుడు వర్షం వస్తే వారు తలదాచుకునేందుకు దగ్గర్లో ఉన్న చెట్ల కిందకు వెళ్తున్నారని ఇలా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు భావిస్తున్నారు. ఔరియా ప్రాంతంలో చెట్టు కింద తలదాచుకునేందుకు వెళ్లిన 14 సంవత్సరాల బాలుడు మృత్యువాతపడ్డాడు.