హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధికి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) ద్వారా కీలక ముందడుగు పడింది. బుధవారం సచివాలయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నాబ్‌కాన్స్ ఉపాధ్యక్షురాలు శిల్పా దేశ్‌పాండేతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు.
వ్యవసా య మౌలిక సదుపాయాల నిధి (అగ్రీ ఇన్‌ఫ్రా ఫండ్-పీఎంయూ) పథకం ద్వారా రైతులకు లాభదాయకమైన పథకాలను అమలు చేయ డంపై సమగ్ర కార్యాచరణ రూపొందించారు. ఏఐఎఫ్ పథకంలో జాతీ య స్థాయిలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. ఏఐఎఫ్ పథ కంలో రాష్ట్రం ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.3,046 కోట్ల నిధులు పొందింది.
వీటితో 1,450 వ్యవసాయ ప్రాథమిక ప్రాసెసింగ్ యూ నిట్లు, 785 గిడ్డంగులు, 209 కస్టమ్ హైరింగ్ సెంట ర్లు, 101 పోస్ట్-హార్వెస్ట్ యూనిట్లను రైతులకు అందజేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం రూ.4,000 కోట్లను నాబ్‌కాన్స్‌ను అడిగినట్లు అధికారులు పేర్కొన్నారు.