calender_icon.png 29 September, 2024 | 4:49 AM

తుమ్మల ఇలాకాలో దళారుల దందా

28-09-2024 01:20:25 AM

  1. పెసర్ల కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ 
  2. వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు!
  3. తక్కువ ధరకు అమ్ముతూ నష్టపోతున్న రైతులు

ఖమ్మం, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన పెసర్ల  కొనుగోలు కేంద్ర ంలో దళారుల దందా కొనసాగుతున్నది. మధ్య దళారులు అధికారులతో కుమ్మక్కై రై తులను అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా పంట నష్టపోయిన రై తులు.. ఉన్న కొద్దిపాటి పంటనైనా ప్రభుత్వ గిట్టుబాటు ధరకు అమ్ముకుందామంటే మ ధ్య దళారులు నిబంధనల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. 

ఖమ్మం, వైరాలో కేంద్రాలు

ఖమ్మం, వైరాలో మార్క్‌ఫెడ్ పెసర్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. క్వింటా లుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర రూ.8,6 82 లుగా ప్రకటించింది. 12 శాతం తేమ, తా లు మించకూడదనే నిబంధన ఉంది. అయి తే కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల వద్ద వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారు.

వ్యాపారులంతా కుమ్మక్కై నిబంధనల సా కుతో తేమ శాతం ఎక్కువుగా ఉన్నదంటూ ధర తగ్గించి అందినకాడిని దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్దుతు ధర కాకుండా రూ.4 వేల నుంచి రూ.7 వేల లోపే చెల్లిస్తున్నట్లు తెలిసింది. 

మంత్రి ఆదేశాలు బేఖాతర్

ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెసర్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆ సందర్భంలో రైతులను ఇబ్బందిపెట్టవద్దని, మార్క్‌ఫెడ్ నిర్ణయించిన గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని వ్యాపారులకు సూచి ంచారు. అయినా కూడా వారిలో ఏ మాత్రం మార్పు లేదు.

విచిత్రమేమం టే రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగో లు చేసి, బినామీ పేర్లతో తిరిగి అదే స రుకును మార్క్‌ఫెడ్‌లో అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇ ప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4,300 క్వింటాళ్లకు పైగానే రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం.