calender_icon.png 12 January, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో ఏటీఎం ధ్వంసం చేసి నగదు చోరీ చేసిన దుండగులు

12-01-2025 11:12:32 AM

కారులో వచ్చి దోపిడీకి పాల్పడ్డ అంతరాష్ట్ర దోపిడి దొంగలు 

కామారెడ్డి జిల్లా పిట్లంలో ఘటన

సంఘటన స్థలాన్ని పరిశీలించిన కామారెడ్డి ఏఎస్పి 

జిల్లాలో సంచలనంగా మారుతున్న ఏటీఎంలలో చోరీ

ఇప్పటికి నాలుగు ఘటనలు,

ఏటీఎం దొంగలను పట్టుకొని పోలీసులు

గ్యాస్ కట్టర్లతో దర్జాగా వచ్చి దోపిడీకి పాల్పడుతున్న దుండగులు

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఏటీఎం గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి అందులో ఉన్న 17 లక్షల పైగా నగదు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపుతుంది. కామారెడ్డి జిల్లా పిట్లం పెట్రోల్ బంక్ సమీపంలో మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎంను గుర్తుతెలియ నీ దుండగులు ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఏటీఎంను గ్యాస్  కట్టర్ తో ధ్వంసం చేసి అందులో ఉన్న 17 లక్షలు నగదును ఎత్తుకెళ్లారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గతంలో కూడా జిల్లాలో ఇదే తరహాలో మూడు సంఘటనలు జరిగాయి. ఈ ఘటన నాలుగో ఘటనగా పోలీసులు భావిస్తున్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలను ధ్వంసం చేసి భారీ చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు మాత్రం ఏటీఎంలో చోరీ దొంగల ముఠాను పట్టుకోలేక  విఫలమవుతున్నారు. కామారెడ్డి జిల్లా జంగంపల్లి ఆంధ్ర బ్యాంక్ ఎటిఎం బ్యాంకులో చోరీకి పాల్పడ్డ దుండగులు భారీ మొత్తంలో చోరీ చేశారు. ఈ ఘటన మరువకముందే నిజాంబాద్ జిల్లా రుద్రూర్లో ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగి ఏడాది కావస్తున్న ఇంతవరకు దుండగులను పట్టుకోలేదు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో గత ఆరు నెలల క్రితం ఏటీఎం ధ్వంసం చేసిన దుండగులు విపలయత్నం చేసి అందులో ఉన్న భారీ నగదును ఎత్తుకెళ్లారు.

గతంలో నిజాంబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ఏటీఎం ను ధ్వంసం చేసి  భారీ చోరీకి పాల్పడ్డారు. తాజాగా పిట్లం మండల కేంద్రంలో ఏటీఎం ధ్వంసం చేసి అందులో ఉన్న 17 లక్షల కు పైగా నగదును ఎత్తుకెళ్లడం కలకలం రేపు తుంది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న ఏటీఎంలనే దుండగులు టార్గెట్ చేసుకుంటున్నారు. వాహనాల్లో వచ్చి దర్జాగా చోరీకి పాల్ప డుతున్నారు. కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి బాన్సువాడ డి.ఎస్.పి సత్యనారాయణ గౌడ్ సిఐ రాజశేఖర్ పిట్లం ఎస్సై రాజు నిజాం సాగర్ ఎస్ ఐ శివకుమార్ వివిధ మండలాల ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో వచ్చి దర్జాగా గ్యాస్ కట్టర్లతో ద్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. గతంలో జరిగిన ఏటీఎంలో చోరీల ఘటనలతో సంబంధం ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. జాతీయ రహదారి గుండా ఉన్న సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన జిల్లా ప్రజలను పోలీసులను ఉలిక్కి గురిచేసింది. భారీ మొత్తంలో చోరీకి పాల్పడడం ఉమ్మడి జిల్లాలో నాలుగు ఘటనలు కావడం పోలీసులకు సవాల్ ను విసురుతున్నారు.