calender_icon.png 10 March, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడలో మూడు ఇండ్లలో చోరీ చేసిన దుండగులు

10-03-2025 07:47:05 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర సోమవారం కాలనీలో సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు ఇంటితో పాటు మరో రెండిళ్లలో ఆదివారం అర్ధరాత్రి చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇళ్లలో ఇంటి తాళాలను పగలగొట్టి దొంగలు యధేచ్చగా దొంగతనాలు చేయడం పట్ల కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత పోలీసులు దొంగతనాలు జరగకుండా గస్తీ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.