calender_icon.png 28 December, 2024 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూన్ తొలి వారంలో థగ్ లైఫ్

08-11-2024 12:00:00 AM

కమల్‌హాసన్.. ఆరు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో కల్ట్ క్లాసిక్ విజయాలతో, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త సినిమాలను అందించాలనే తపనతో పనిచేస్తుంటారు. అందుకే చాలా మంది దర్శకులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా కమల్‌హాసన్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటారు. ఇక దర్శకుడు మణిరత్నం.. తనదైన విజన్, రైటింగ్, డైరెక్షన్‌తో అశేషమైన ప్రేక్షకాదరణ పొందారు. ఆ సెన్సేషనల్ కాంబో 37 ఏళ్ల తర్వాత ‘థగ్ లైఫ్’తో ఒక ఎపిక్ యాక్షన్ డ్రామాను అందించడానికి సిద్ధమైంది.

ఆ చిత్రమే ‘థగ్ లైఫ్’. ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పుడే భారీ అంచనాలేర్పడ్డాయి. అయితే, గురువారం కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘థగ్ లైఫ్’కు సంబంధించి ఓ టీజర్‌ను విడుదల చేశారు. అదిప్పుడు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇందులో కమల్ హాసన్ విభిన్నమైన లుక్స్‌తో కనిపించారు. ఈ టీజర్ ద్వారానే మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

2025, జూన్ 5న థియేటర్ల ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. త్రిష కృష్ణన్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లేఖి, అభిరామి, నాజర్, జోజు జార్జ్ వంటి ప్రముఖ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్; సంగీతం: ఏఆర్ రెహమాన్; యాక్షన్ కొరియోగ్రఫీ: అన్బరీవ్.   నిర్మాతలు: కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్; శివ అనంత్; రచన, దర్శకత్వం: మణిరత్నం.