calender_icon.png 21 February, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలపాగాలు చెత్తబుట్టలలో వేసి..

18-02-2025 01:14:13 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఆదివారం 112 మంది అక్రమవలసదారులతో అమృత్‌సర్‌కు చేరుకున్న విమానంలో.. వచ్చిన జితేందర్ సింగ్ అనే వ్యక్తి పలు ఆరోపణలు చేశారు. ‘అమెరికా వెళ్లేందు కు ఓ ఏజెంట్‌కు రూ. 50 లక్షలు ముట్టజెప్పా. కానీ అతడు నన్ను అక్రమ మా ర్గంలో తీసుకెళ్లాడు. అమెరికాకు చేరుకునేందుకు పనామా అడవుల ద్వారా వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డాం.

అమెరికా అధికారులు ఇక్కడకి తీసుకొచ్చే కంటే ముందు రెండు వారాల పాటు అగ్రరాజ్యంలోని డిటెన్షన్ క్యాంప్‌లో ఉంచారు. ఆ క్యాం ప్‌లో మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశారు. మాకు సరైన ఆహారం కూ డా అందించలేదు. నా టర్బైన్ (సిక్కుల తల పాగా)ను బలవంతంగా తీసి చెత్తబుట్ట లో పడేశారు’ అని అతడు తెలిపాడు.