calender_icon.png 22 January, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోకోదే పైచేయి

22-01-2025 12:10:36 AM

  • క్వార్టర్స్‌లో అల్కరాజ్‌పై ఉత్కంఠ విజయం

కోకో గాఫ్‌కు బడోసా షాక్

సెమీస్‌లో అడుగుపెట్టిన సబలెంక

ఆస్ట్రేలియన్ ఓపెన్

మెల్‌బోర్న్: అనుభవం ముందు ఎంతటి వారైనా తలవంచాల్సిందే అని మరోసారి నిరూపితమయ్యింది. బిగ్ ఒకడిగా పేరున్న సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. టైటి లే లక్ష్యంగా కసిగా ఆడుతున్న జొకోవిచ్ ఈతరంలో తనకు సమ ఉజ్జీగా భావిస్తోన్న కార్లోస్ అల్కరాజ్‌పై పైచేయి సాధించాడు.

సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఏడో సీడ్ జొకోవిచ్ సెమీస్‌లో అడుగపెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 4 6 6 6 అల్కరాజ్‌పై ఉత్కంఠ విజయాన్ని అందుకున్నాడు. మూడున్నర గం టల పాటు సాగిన హోరాహోరీ పోరులో అల్కరా జ్‌కు తొలి సెట్‌ను కోల్పోయిన జొకోవిచ్ ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో విజ యం సాధించి ఆధిపత్యం ప్రదర్శించాడు.

నాలుగో సెట్‌లో అల్కరాజ్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ తన అనుభవాన్ని రంగరించిన జొకోవిచ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మ్యాచ్‌లో అల్కరాజ్ 9 అనవసర తప్పిదాల తో మూల్యం చెల్లించుకున్నాడు. 

శుక్రవారం జరగనున్న సెమీస్‌లో జొకోవిచ్ గతేడాది రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (రష్యా) 7 (7/1), 7 (7/0), 2 6 టామీ పాల్ (అమెరికా)పై కష్టపడి నెగ్గాడు. మూడు గంట లకు పైగా సాగిన పోరులో టామీ పాల్ 9 ఏస్‌లు, 44 విన్నర్లు సంధించినప్పటికీ 54 అనవసర తప్పిదాలు చేశాడు. నేడు పురుషుల క్వార్టర్స్‌లో సిన్నర్‌తో అలెక్స్ డి మినా ర్, బెన్ షెల్టన్‌తో సొమెంగో అమీతుమీ తేల్చుకోనున్నారు.

బడోసా, సబలెంక అదుర్స్

ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ చేజెక్కించుకోవాలనుకున్న అమెరికా నల్లకలువ కోకో గాఫ్‌కు షాక్ తగిలింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో స్పెయిన్ చిన్నది పౌలా బడోసా 7 6 గాఫ్‌పై వరుస సెట్లలో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో గాఫ్ 41 అనవసర తప్పిదాలతో పాటు ఆరు డబుల్ ఫాల్ట్స్ నమోదు చేసింది. గాఫ్ 11 సార్లు బడోసాకు సర్వీస్‌ను కోల్పోయింది. ఇక బడోసా మూడు ఏస్‌లతో పాటు 15 విన్నర్లు సంధించింది.

మరో క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంక (బెలారస్) 6 2 6 పల్విచెంకోవాపై సునాయాస విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో 13 గ్రౌండ్ స్ట్రోక్ షాట్లతో అలరించిన సబలెంక 29 విన్నర్లు కొట్టగా.. పల్విచెంకోవా 23 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. నేడు మహిళల క్వార్టర్స్‌లో స్వియాటెక్‌తో నవారో, మాడిసన్ కీస్‌తో స్వితోలినా తలపడనున్నారు.