పీకేఎల్ 11వ సీజన్
హైదరాబాద్: పీకేఎల్-11లో భాగంగా శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 42-37 తేడాతో యూపీ యోధాస్ మీద విజయం సాధించింది. తొలుత యూపీ సులభంగా గెలుస్తుందని అనిపించినా కానీ తర్వాత పట్నా పుంజుకుని విజయాన్ని కైవసం చేసుకుంది. పట్నాలో రైడర్ దేవాంక్ సూపర్ టెన్ సాధించాడు.
యూపీ స్టార్ ఆల్‌రౌండర్ భరత్ 6 పాయింట్లతో పర్వాలేదనిపించాడు. ఆరంభంలో దూకుడుగా ఆడిన యోధాస్ తర్వాత మాత్రం పట్నాకు తలవంచి ఓటమిని కొని తెచ్చుకుంది. తెలుగు టైటాన్స్ 38-35 తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. ఘన విజయం సాధించాల్సిన జట్టు చివరికి విజయం కోసం శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్టార్ రైడర్, కెప్టెన్ పవన్ షెరావత్ సూపర్ టెన్ సాధించినా కానీ చివరి నిమిషం వరకు మ్యాచ్ ఉత్కంఠను రేకెత్తించింది. ఒకానొక దశలో మునుపటి మ్యాచుల్లాగే తెలుగుకు మరో పరాజయం తప్పదని అనిపించినా కానీ చివరికి గెలిచి ఊపిరిపీల్చుకుంది. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ ఐదో స్థానానికి చేరుకుంది.