calender_icon.png 20 April, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థ్రిల్లింగ్ బ్లెండ్ స్పాట్

19-04-2025 12:00:00 AM

నవీన్‌చంద్ర హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘బ్లుండ్ స్పాట్’. రాకేశ్‌వర్మ దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా బ్యానర్‌పై రామకృష్ణ వీరపనేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో రాశీసింగ్ కథానాయిక. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ.. “ఇది చాలా మంచి థ్రిల్లర్. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం.

ఈ సినిమా పోస్టర్‌లో ఒక క్లూ ఉంది. అది కనిపెట్టి నాకు మెసేజ్ చేస్తే వాళ్లతో కలిసి నేను సినిమా చూస్తా” అన్నారు. హీరోయిన్ రాశీసింగ్ మాట్లాడుతూ.. ‘సినిమా అంతా నా పాత్ర ఏడుస్తూనే ఉంటుంది. నటుల నుంచి ప్రతిభను రాబట్టుకునే విషయంలో డైరెక్టర్ రాకేశ్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. నవీన్‌చంద్రతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభూతినిచ్చింది.

ఆయన నాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు. నా ఫేవరెట్ జోనర్‌లో వస్తున్న సినిమా ఇది. అందుకే రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పారు. దర్శకుడు రాకేశ్ మాట్లాడుతూ.. ‘నవీన్‌చంద్ర ఎప్పుడూ క్యారెక్టర్‌లోనే ఉంటారు.  రాశీసింగ్ గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు తెచ్చుకునే నటి. రెండు వేరియేషన్స్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది’ అని తెలిపారు.  నటీనటులు గాయత్రి భార్గవి, రవివర్మ,  చిత్రబృందం పాల్గొన్నారు.