calender_icon.png 1 November, 2024 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడేళ్లు.. మూడు ఘట్టాలు

08-07-2024 12:04:17 AM

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ 

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి) : పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఆదివారంతో మూడేళ్లు పూర్తికావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఆనాడు నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సోనియాగాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలం దరికీ కృతజ్ఞతలంటూ ఆసక్తికర ఫొటోలు పంచుకున్నారు. ‘పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం, సోనియాగాంధీ సారథ్యంలో విజయభేరి సభ నిర్వహించడం, నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం’ ఈ మూడేళ్లలో మూడు ఘట్టాలు తన జీవితంలో మరువలేనిని సందర్భాలని పేర్కొన్నారు. ఈ ప్రస్థానంలో తనకు సహకరించిన పార్టీ సీనియర్ నేతలు, పార్టీ అధికారంలోకి రావడానికి లక్షలాది మంది కార్యకర్తల కఠోర శ్రమ, కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజాపాలనకు నాంది పలికిన నాలుగు కోట్ల ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.