calender_icon.png 8 January, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముచ్చటగా మూడేళ్ల తర్వాత

09-11-2024 12:00:00 AM

సంయుక్త మీనన్ స్వతహాగా మలయాళ హీరోయిన్ అయినా తెలుగు సినిమాతోనే పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటించిన మలయాళం అంథాలజీ థ్రిల్లర్ చిత్రం ‘ఆనుమ్ పెన్నుమ్’ థియేటర్లలో విడుదలైన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. మూడు కథలతో తెరకెక్కిన ఈ సినిమాను మూడు జంటల కథతో వేణు, ఆషిక్ అబు, జయ్ కే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇలా మూడు ఉప కథల సమాహారంగా సాగిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సావిత్రి కథలో జోజు జార్జ్, సంయుక్త మీనన్, ఇంద్రజీత్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సావిత్రి కథ 1950 టైమ్ పీరియడ్‌లో సాగుతుంది. అప్పటి ప్రభుత్వాల్ని ఎదురించి సావిత్రి అనే సాధారణ గృహిణి ఎలాంటి పోరాటం చేసింది? అజ్ఞాతంలో ఉన్న సావిత్రి ఎలా పట్టుబడింది అనే అంశాలతో ఈ ఎపిసోడ్ రూపొందింది.

ప్రస్తుతం ఈ చిత్రం సైనా ప్లే, అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఇక సంయుక్త.. తాజా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేస్తోంది. ‘స్వయంభూ’ షూటింగ్ దశలో ఉండగా.. శర్వానంద్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ల సినిమాల్లో కథానాయికగా కనిపించబోతోందీ చిన్నది. అంతేకాక సంయుక్త చేస్తున్న ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా ఇటీవలే మొదలైంది. కాజల్, ప్రభుదేవా ప్ర ధాన పాత్రల్లో నటిస్తున్న మరో హిందీ చిత్రంలోనూ సంయుక్త ఓ కీలకలో నటిస్తోంది.