ఎల్బీనగర్, సెప్టెంబర్ 23: మైనర్ ను వేధించిన నిందితుడికి ఎల్బీనగర్‌లోని పోక్సో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు మూడేండ్ల జైలుశిక్ష విధించింది. నాగోల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనంపల్లి కుమార్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుమా ర్ కొద్దిరోజులుగా ఓ బాలిక వెంట పడుతూ ప్రేమించమని వేధిస్తున్నా డు. దీంతో బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు నాగోల్ పోలీసులను ఆశ్రయించడంతో వారు నిందితుడిపై కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత కోర్టులో చార్జిషీట్ వేశారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు విచారించింది. కుమార్ బాలికను వేధించినట్లు కోర్టు నిర్ధారణకువ వచ్చి మూడేండ్ల జైలుశిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. బాధితురాలికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది.