calender_icon.png 8 November, 2024 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనం కేసులో ఒకరికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా

31-08-2024 09:59:49 AM

బెల్లంపల్లి (విజయక్రాంతి): వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 సంవత్సరంలో ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కల్మల పేట గ్రామానికి చెందిన సల్పల శ్రీనివాస్ అనే వ్యక్తికి శుక్రవారం బెల్లంపల్లి మెజిస్ట్రేట్ జె ముఖేష్ మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ 500 జరిమానా విధించినట్లు నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్ తెలిపారు.

నిందితుడు బాధిత ఇంట్లో దొంగతనానికి పాల్పడి 14.75 తులాల బంగారం, ఆరు తులాల వెండి నగల తో పాటు రూ 2,62,600 నగదు ఎత్తుకెళ్లాడని తెలిపారు. దొంగతనం కేసులో సీఐ డి సుధాకర్ సమక్షంలో విచారణ జరిపి నేరస్తుని పై చార్జిషీట్ వేశామన్నారు. కోర్టు పిసికే సంపత్ సాక్షులను ప్రవేశపెట్టారని చెప్పారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. అజయ్ కుమార్ ఆరుగురు సాక్షులను ప్రవేశపెట్టి విచారించగా నేరం రుజువు కావడంతో మెజిస్ట్రేట్ జె. ముఖేష్ నిందితునికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ 500 జరిమానా విధించినట్లు ఎస్సై శ్యామ్ పటేల్ తెలిపారు.