ఎల్బీనగర్: అపార్ట్మెంట్ నిర్మాణానికి చేపట్టిన సెల్లార్ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... ఎల్బీనగర్ లోని సితార్ హోటల్ వెనుక ప్రాంతంలో సెల్లార్ తవ్వకాలు చేపడుతున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు పనులు చేస్తుండగా సెల్లార్ గోడ కూలింది. భారీస్థాయిలో మట్టి గడ్డలు మీద పడడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నది.