calender_icon.png 19 January, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సివిల్ కానిస్టేబుల్ లకు మూడు వారాల శిక్షణ పూర్తి: జిల్లా ఎస్పీ

18-01-2025 08:07:05 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాకు నూతనంగా వచ్చిన కానిస్టేబుల్ లకు వారానికి ఒకరోజు చొప్పున ఐదు వారాల పాటు వివిధ అంశాలలో నిష్ణాతులైన సిబ్బంది చేత పోలీస్ స్టేషన్ విధులు, ప్రస్తుత పోలీస్ విధి విధానాలపై శిక్షణను అందించినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. డిసెంబర్ 20న ప్రారంభమై 3 బ్యాచులుగా విభజించి వారానికి మూడు రోజులపాటు శిక్షణను తీసుకొన్న 145 సివిల్ కానిస్టేబుల్ లకు ఈ శిక్షణలో భాగంగా కోర్టు డ్యూటీ విధులు, రిసెప్షన్ విధులు, పిటీషన్ మేనేజ్మెంట్ విధులు, బ్లూ కోర్ట్, డయల్ 100, పెట్రోలింగ్, బిట్ సిస్టం, అనుమానితులను పరిశీలించడం, నేర నియంత్రణ, నేర పరిశోధన, సి.సి.టి.ఎన్.ఎస్, సైబర్ క్రైమ్, సిఈఐఆర్, ముఖ్యంగా ప్రమాదాల సమయంలో ప్రజలను కాపాడేందుకు ఉపయోగపడే సిపిఆర్ పద్ధతిని సిబ్బందికి పూర్తి అవగాహనను కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణను అందించి, కోర్టు విధులు న్యాయపరంగా వచ్చే సమస్యలను వివరించిన మాజీ పీపి రమణారెడ్డి, ఫిజికల్ మేనేజ్మెంట్పై శిక్షణ అందించిన పురుషోత్తం రెడ్డి, సుధీర్ రెడ్డిలను అభినందించారు.