కరీంనగర్ సిటీ, జనవరి9: శాతవాహన యూనివర్సిటీ కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి, స్వామి వివేకానంద జయంతి పురస్కరిం చుకొని విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన డా”హరికాంత్ ఎంబీఏ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి ప్రజ్వలన చేసి ము గ్గుల పోటీలను ప్రారంబించారు.. పోటీలు అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.. ఈ ఏబీవీపీ రాష్ర్ట కార్యస మితి సభ్యురాలు కిరణ్మయి ఎబివిపి యూ నివర్సిటీ అధ్యక్షులు బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ పూజ, శివ, సద్విక, సాత్విక, దీపక్, నరేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నరు.
మేయర్‌ను కలిసిన పెన్షనర్లు
కరీంనగర్, జనవరి9(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులైన పెన్షనర్లు నగర మేయర్ యాదగిరి సునీల్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గల తెలంగాణ పెన్షనర్ అసోసియేషన్ భవనంలో సౌకర్యా లు కల్పించాలని వినతి పత్రం అందజే శారు.
పెన్షనర్ అసోసియేషన్ భవనంలో న్యూస్ పేపర్స్, బుక్స్ తో పాటు ఇతర చిన్న చిన్న సౌకర్యాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ పెన్షనర్ అసోసియేషన్ అద్యక్షులు పెండ్యాల కేశవ రెడ్డి, నారాయణ గౌడ్, ట్రెజర్ నాగుల రాజ రాం, కార్యదర్శి లింగయ్య పాల్గొన్నారు.