మేడ్చల్, జనవరి 23: ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఓటు ప్రాముఖ్యతను వివరించడంలో భాగంగా గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. 16 డిపార్టుమెంటులకు చెందిన ఉద్యోగినులు ఈ పోటీలలో పాల్గొన్నారు. జిల్లా అధికారులు న్యాయ నిర్నేతలకు వ్యవహరించి ఉత్తమ ముగ్గులను ఎంపిక చేశారు. మొదటి బహుమతి పశుసంవర్ధక శాఖకు, రెండో బహుమతి రెవెన్యూ శాఖకు, మూడో బహుమతి గ్రామీణాభివృద్ధి శాఖకు అందజేశారు.