calender_icon.png 17 April, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మియాపూర్‌లో లారీ బీభత్సం

08-04-2025 10:27:30 AM

మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం

డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ

లారీ ఢీకొని ముగ్గురు ట్రాఫిక్ పోలీసులకు తీవ్రగాయాలు

చికిత్స పొందుతూ హోంగార్డ్ సింహాచలం మృతి

హైదరాబాద్: నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్(Miyapur Metro Station) వద్ద మంగళవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది. లారీ ఢీకొని ముగ్గురు ట్రాఫిక్ పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హోంగార్డు సింహాచలం(Home Guard Simhachalam) మృతి చెందాడు. మృతుడు సింహాలచం స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసగా గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు రాజ్యవర్ధన్, విజేందర్ కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.