calender_icon.png 11 January, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైకుంఠవాసుడికి ముక్కోటి దండాలు

11-01-2025 01:22:42 AM

మహబూబ్ నగర్, జనవరి 10 (విజయ క్రాంతి) : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వ్యాప్తం గా వైష్ణవాలయాలు భక్తులు పోటెత్తారు. ఆలయ నిర్వాహకులు భక్తులు  ఉత్తరద్వా రాల నుంచి ప్రవేశం కల్పించడంతోపాటు ప్రత్యేకంగా ఏడు ద్వారాలను ద్వారా దర్శనం కల్పించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్య క్రమాలు చేపట్టారు. ఆలయంలో తెల్లవారు జామున నుంచి భక్తులకు దశానికి అనుమ తించారు. వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారు తీరారు. ఆలయంలో స్వామివారికి రోజంతా సహస్ర మార్చిన పుష్పార్చన ఇతర ప్రత్యేక పూజలు జరిగాయి.

ఆలయ ప్రాంగణంలో వేద పండితులు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం గావించారు. శివగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తిడిగుట్ట తిరుమలనాథ స్వామి దేవాలయంలో ఉత్తరద్వారా ప్రత్యేక దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచి క్యూలో నిలుచున్నారు.  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. 

పట్టణంలో శ్రీనివాస కాలనీ పంచ ముఖ ఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామి వారి సన్నిధిలో ఉత్తర దారం నుంచి దర్శనం చేసుకుని భక్తులు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  జిల్లాలో పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు తెల్లవారుజా మున నుంచి ఆలయాల్లో భక్తులు తమ మొక్కులను తీర్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు