15-02-2025 02:00:07 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యా యమూర్తులుగా జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి, జస్టిస్ సుజన కలాసికం శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ ప్రమా ణం చేయించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జనరల్ ఎస్.గోవర్థన్‌రెడ్డి చదివి వినిపించారు. ముగ్గురు న్యాయమూర్తులు 2023 జూలై 31న అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టగా, కేంద్రం వారిని శాశ్వత న్యాయమూర్తులు నియమిస్తూ కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు న్యా యమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూ టీ సొలిసిటర్ జనరల్ జి.ప్రవీణ్‌కుమార్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్స్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.